చర్ల ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చిన లేక్ష్యశ్రీ

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు..ఘనంగా పౌర సన్మానం

"అక్షర ఆయుధం న్యూస్" చర్ల మండల రిపోర్టర్ (సెప్టెంబర్‌ 2): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన నంబూరి శ్రీనివాసరావు, అశ్విని దంపతుల కుమార్తె, చిన్నారి నంబూరి లేక్ష్యశ్రీ,గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు సంపాదించి చర్ల మండల ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది.హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఇటీవల నిర్వహించిన ప్రపంచ స్థాయి కరాటే పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం 6వ తరగతి విద్యార్థిని లేక్ష్యశ్రీని బుధవారం సాయంత్రం మండల ప్రముఖులు ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన సభలో లేక్ష్యశ్రీ తో పాటు కరాటే శిక్షకుడు యు.ముత్తు,తల్లిదండ్రులు నంబూరి శ్రీనివాసరావు, అశ్విని,లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఉపాధ్యాయ బృందం,మీకోసం మేమున్నాం,టీం ఛైర్మన్ లయన్ నీలి ప్రకాష్,ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ చిన్న వయసులోనే కరాటేలో అసాధారణ ప్రతిభ కనబరిచి చర్ల పేరును ప్రపంచ రికార్డుల్లో నిలిపిన లేక్ష్యశ్రీని అభినందించారు.పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేస్తే చిన్న వయసులోనే గొప్ప విజయాలు సాధించవచ్చని ఆమె నిరూపించిందన్నారు.లేక్ష్యశ్రీ సాధించిన ఘనతను జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి లేక్ష్యశ్రీ సాధించిన విజయం చర్ల మండలం లోని ఇతర విద్యార్థులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.