ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు

. మహాదేవపూర్ మండల అధ్యక్షుడు కటకం అశోక్

(అక్షరఆయుధంన్యూస్):మహాదేవపూర్ ప్రతినిధి:గొరంట్ల రాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో మహాదేవపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కటకం అశోక్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతు సంక్షేమం వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో వైస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మహాదేవపూర్ సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.