
అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టర్ జయకుమార్ ప్రశాంతంగా సొసైటీ ఎన్నికలు అధ్యక్షుడిగా వాడ గంగరాజు ఏకగ్రీవ ఎన్నిక గొర్రెల మేకల పెంపకందారులను ప్రభుత్వం ఆదుకోవాలని గుట్టపాలెం గొర్రెల మేకల పెంపకందారుల సొసైటీ నూతన అధ్యక్షుడు వాడ గంగరాజు కోరారు. కలికిరి మండలం గుట్టపాలెం సచివాలయంలో బుధవారం సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వాడ గంగరాజు కార్యదర్శిగా యతేంద్రకుమార్ డైరెక్టర్లుగా ఈశ్వరయ్య కరుణాకర్ రాజశేఖర్ శంకర మునీంద్ర ఎన్ని కయ్యారు.ఈ సందర్భంగా వాడ గంగరాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సొసైటీల ద్వారా గొర్రెల మేకల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నా ప్రభుత్వాలు సొసైటీలను బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. గొర్రెలు మేకలకు మేత కోసం ప్రభుత్వ భూములు కేటాయించాలని pగతంలో జీవో జారీ చేసినా అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు మరియు వ్యాధుల కారణంగా గొర్రెలు మేకలు మృతి చెంది పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యులకు షరతులు లేని రుణాలు అందించాలని గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇత్తన పొట్టేళ్లను అందించి పెంపకందారులను ఆదుకోవాలని కోరారు.ఎన్నికల అధికారులుగా మునిచంద్రారెడ్డి గిరినాథ్‌రెడ్డి వ్యవహరించగా సొసైటీ సభ్యులు పెంపకందారులు పాల్గొన్నారు