
అక్షర ఆయుధం న్యూస్: (తేదీ1 నవంబర్ 26) రిపోర్టర్ కె రాజశేఖర్ సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ – కొత్తూరు ప్రధాన రహదారిలో పత్తికగూడ – గొయిది గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, వాటిలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనాల ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.