
అక్షర ఆయుధం న్యూస్ 2 సెప్టెంబర్ 2026 : (రిపోర్టార్ జి రాంబాబు) అల్లూరి జిల్లా వార్త విశ్లేషణ : అరకు నియోజకవర్గం అల్లూరి జిల్లా.అరకు: గిరిజన, హరిజన, బడుగు–బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన జనహృదయ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన పేదలు, గిరిజనులు, దళితులు, బడుగు–బలహీన వర్గాల కోసం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శాంతకుమారి స్మరించుకున్నారు.“పేదవాడి ఇంటికి వైద్యం, గిరిజన బిడ్డ చేతికి విద్య, రైతు కుటుంబానికి భరోసా” అనే ఆలోచనతో డా. వైయస్సార్ పనిచేశారని ఆమె కొనియాడారు.ప్రత్యేకంగా 108 అత్యవసర వైద్య సేవలు ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ వంటి ఆరోగ్య పథకాల ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య చికిత్స అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు.అదేవిధంగా గిరిజనులు, దళితులు, బడుగు–బలహీన వర్గాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను పొందాలనే లక్ష్యంతో విద్యా రంగంలో అనేక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని శాంతకుమారి అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అవకాశం కల్పించడంలో ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది జీవితాలను మార్చాయని పేర్కొన్నారు.“వైయస్సార్ పాలన అంటే పేదవాడికి భరోసా.. రైతుకు ధైర్యం.. గిరిజనుడికి అండ.. విద్యార్థికి భవిష్యత్తు.. అనారోగ్యంతో ఉన్న కుటుంబానికి వైద్య భద్రత” అని శాంతకుమారి అన్నారు.
నేటి రాజకీయ పరిస్థితుల్లో కూడా డా. వైయస్సార్ ఆశయాలు మరింత అవసరమని ఆమె పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాధి వంటి మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గిరిజనుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణలు, 5వ షెడ్యూల్ ప్రాంతాల ప్రత్యేక హక్కులు, పిసా చట్టం, 1/70 చట్టం వంటి అంశాల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని శాంతకుమారి స్పష్టం చేశారు.డా. వైయస్సార్ ఆశయాలను కేవలం వర్ధంతి కార్యక్రమాలకు పరిమితం చేయకుండా, ఆయన చూపిన పేదల పక్షపాత మార్గంలో ప్రజల కోసం నిరంతరం పోరాడటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆమె అన్నారు.“వైయస్సార్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. పేదల గుండెల్లో, రైతుల జీవితాల్లో, గిరిజన విద్యార్థుల భవిష్యత్తులో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వైయస్సార్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలి” అని పాచిపెంట శాంతకుమారి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు.ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.