కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వాడపాలెం నుండి కొత్తపేట వరకు భారీ బైక్ ర్యాలీ

అక్షర ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 2 కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ పులుపు కరుణాకర్ రావులపాలెం కొత్తపేట నియోజకవర్గ లో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం సెంటర్లో నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ గారు జనసేన జెండా ఆవిష్కరించి పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిలలుతో కలిసి భారీ బైక్ ర్యాలీని కొత్తపేటలో బండారు బుల్లి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపం వరకు కొనసాగింది. ర్యాలీ మార్గం మధ్యలో జనసైనికులుతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఐ బ్యాంక్ వంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, మొక్కలు పంపిణీ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేదిక వద్దకు చేరుకొని యువజన విభాగం ఆవిష్కరణకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రసంగం లైవ్ కార్యక్రమం పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు