కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలపై ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ

సంగారెడ్డి జిల్లా,ఝరాసంగం సెప్టెంబర్ 2 అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టార్ రాజు కుమార్ జహీరాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో,కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలు,అమలు కాని హామీలు, ప్రజలను మోసం చేసిన తీరును నిరసిస్తూ బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు.బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, తాజ ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు,మాజి డి.సి.ఎం.ఎస్ చైర్మన్ శివకుమార్ హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్యే మాణిక్ రావు విమర్శించారు.ఈ కార్యక్రమంలో వివిధ మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని,ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మాణిక్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లు, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఏంపిపి లు, మాజీ ఏం.పి.టి.సి లు, కౌన్సిలర్స్ లు,వివిధ మండల్ పార్టీ అధ్యక్షులు,తాజ,మాజీ గ్రామ సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.