ఎయిడ్స్ సురక్ష, నేత్ర దాన ప్రాముఖ్యత, టి. బి. పై విద్యార్థులకు అవగాహన సదస్సు

అన్నమయ్య జిల్లా కలికిరి మండలం (అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టర్ జయకుమార్ ) *95-95-99 లక్ష్యాల సాధనకు కృషి: డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ *సదుం లో 2/9/26ఎయిడ్స్ సురక్ష కొరకు జనసమీకరణ చేద్దాం మరియు నేత్ర దానం చేద్దాం ఇద్దరి జీవితాలలో వెలుగు నింపుదాం అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు అంతర్జాతీయ యువజన మాసోచ్చవాలు మరియు నేత్రదాన పక్షోత్చావాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి పర్యవేక్షణ లో దిశ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని జ్యోతిరావ్ పోలె జూనియర్ కళాశాల విద్యార్థులకు జయచంద్ర నాయుడు మరియు పి. హెచ్. సి. చెరుకువారి పల్లి వైద్యులు డాక్టర్ గాయత్రి డాక్టర్ హేమంత్ కృష్ణ అధ్యక్షతన మొబైలిజషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష నేత్రధాన పక్షోత్చావాల టి. బి. ముక్త్ భారత్ కార్యక్రమం పై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ యువతలో హెచ్‌ఐవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడం హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సకాలంలో పరీక్షలు మరియు చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు
95-95-99 లక్ష్యాల గురించి వివరించారు: మొదటి 95: హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ హెచ్‌ఐవీ స్థితి గురించి తెలిసేలా పరీక్షలు నిర్వహించాలి. రెండవ 95: హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించిన వారిలో 95 శాతం మందికి యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ (ఎ ఆర్ టి ) చికిత్స అందించాలి
మూడవ 99: చికిత్స పొందుతున్న వారిలో 99 శాతం మందిలో వైరల్‌ లోడ్‌ను అణచివేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి అవకాశాలను తగ్గించాలియువత హెచ్‌ఐవీపై అపోహలకు దూరంగా ఉండి సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని అవసరమైన వారు సమీపంలోని ఐసీటీసీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా వారికి సామాజికంగా వైద్యపరంగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు95-95-99 లక్ష్యాల సాధన ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించి ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు కరపత్రాలు పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు నేత్రధానం కుటుంబ సంప్రదాయంగా చేసుకోవాలని ఒకరి నేత్రధానం ఇద్దరి జీవితాలలో వెలుగు నింపుతుంది అనంతరం నేత్రధాన ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో వైద్యులు డాక్టర్ గాయత్రి డాక్టర్ హేమంత్ కృష్ణ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఎమ్. పి. హెచ్. ఈ. ఓ. నాగరాజు పర్యవేక్షకులు నీలకంఠ షికామని ఎమ్. ఎల్. హెచ్. పి. రషీద్ మేల్ నర్స్ ఆశ్రఫ్ ఏ. ఎన్. ఎమ్. కళ్యాణి కళాశాల అధ్యాపకులు ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.