
అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ సెప్టెంబర్ 3, అక్షర ఆయుధం: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి పట్టణంలో జనసేన శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ భీమరిశెట్టి రాంకీ ఆధ్వర్యంలో జనసైనికులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో జనసైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ర్యాలీలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా బైక్ నడుపుతూ జనసైనికులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బైక్ ర్యాలీలో పాల్గొనడంతో జనసైనికుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి పట్టణం జనసేన జెండాలు, నినాదాలతో సందడిగా మారింది. పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొనడంతో ర్యాలీ ఘనంగా సాగింది.